Monday, October 27, 2014

ముద్దులు, కౌగిలింతలతో ప్రేమికుల నిరసన!!!


తిరువనంతపురం: 'మొరల్ పోలీసింగ్' పేరుతో గతవారం కేరళలోని కోజికోడ్ రెస్టారెంట్ లో యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా కోచి మెరైన్ డ్రైవ్ వద్ద యువతీ, యువకులు పెద్ద ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 2 తేదిన నిర్వహించే కార్యక్రమంలో బహిరంగంగా ప్రేమ జంటలు ముద్దులు, కౌగిలింతలు పెట్టుకుని నిరసన తెలుపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 
 
త్వరలోనే ఈ నిరసన కార్యక్రమానికి సంబందించిన విషయాలను తెలిపేందుకు సోషల్ మీడియాను కూడా ఆసరా చేసుకోనున్నారు. త్వరలోనే ఫేస్ బుక్ పేజ్ ను ప్రారంభించినట్టు నిరసనకారులు తెలిపారు. అక్టోబర్ 23 తేదిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితున్నారనే ఆరోపణలపై కోజికోడ్ లోని రెస్టారెంట్ పై యువ మోర్చా కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో కొంతమంది యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

No comments:

Post a Comment